Fathers Cannot Do One Thing Alone, Survey : 'పేరెంటింగ్'పై సర్వే | Oneindia Telugu

2017-11-24 50

The survey, conducted by Mumbai-based Podar Institute of Education, also found that though fathers are getting more involved in parenting but a majority of them cannot do it alone and need the help of their wives.

ఒక్క రోజు భార్య ఇంట్లో లేకపోతేనే భర్త గారికి ఏమి తోచదు. పొద్దున బ్రేక్ ఫాస్ట్ దగ్గరి నుంచి పిల్లలను రెడీ చేసి స్కూలుకు పంపి, ఆపై ఆఫీసుకెళ్లి.. తిరిగొచ్చి మళ్లీ వంట చేసి పిల్లలకు తినిపించి నిద్రపుచ్చేసరికి నిజంగానే దిమ్మతిరిగి పోతుంది. సతీమణి చకచకా చక్కబెట్టే ఈ పనులన్ని భర్త గారు మాత్రం ఆపసోపాలు పడుతూ చేస్తుంటాడు. ఒకవేళ భార్య తోడు లేకుండా పిల్లలను వెంట తీసుకెళ్లాల్సి వస్తే!.. తాజాగా నిర్వహించే ఓ సర్వేలో కొంతమంది పురుషులను ఇదే ప్రశ్న అడగ్గా.. హమ్మో మావల్ల కాదంటూ చేతులెత్తేశారు.
సర్వేలో దాదాపు 88శాతంమంది తండ్రులు భార్య తోడు లేకుండా పిల్లలను బయటకు తీసుకెళ్లలేమని కుండబద్దలు కొట్టారు. షాపింగ్‌, సినిమా హాళ్లు, ఫంక్షన్లలో పిల్లలు చేసే అల్లరిని భరించడం, మారాం చేస్తే బుజ్జగించడం ఇవన్నీ తమవల్ల కాదంటున్నారు.
ముంబైకి చెందిన పొడార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 4800 మంది తండ్రులపై సర్వే నిర్వహించగా, వారిలో 33శాతంమంది ఇంటి పనులను పంచుకుని, పిల్లలతో హోం వర్క్‌ చేయిస్తున్నట్టు తేలింది.

Free Traffic Exchange